ఓటీటీ Vs వీకెండ్ రిలీజ్.. గట్టి పోటీ!
మొన్నటివరకు ఓ థియేటర్ లో ఆడుతున్న సినిమా, మరో థియేటర్ లో ఆడుతున్న సినిమాకు పోటీగా ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్ కు ఓటీటీ పోటీగా నిలిచింది. ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే, వాటికి పోటీగా ఓటీటీలో కూడా బ్రహ్మాండమైన స్టఫ్ రిలీజ్ అవుతోంది. ఈ శుక్రవారం కూడా ఓటీటీకి, థియేటర్లకు మధ్య పోటీ తప్పలే లేదు. ముందుగా థియేట్రికల్ రిలీజ్ విషయానికొస్తే.. రేపు 10వ తేదీన సూర్య నటించిన ఈటీ సినిమా […]
మొన్నటివరకు ఓ థియేటర్ లో ఆడుతున్న సినిమా, మరో థియేటర్ లో ఆడుతున్న సినిమాకు పోటీగా ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్ కు ఓటీటీ పోటీగా నిలిచింది. ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే, వాటికి పోటీగా ఓటీటీలో కూడా బ్రహ్మాండమైన స్టఫ్ రిలీజ్ అవుతోంది. ఈ శుక్రవారం కూడా ఓటీటీకి, థియేటర్లకు మధ్య పోటీ తప్పలే లేదు.
ముందుగా థియేట్రికల్ రిలీజ్ విషయానికొస్తే.. రేపు 10వ తేదీన సూర్య నటించిన ఈటీ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ వచ్చిన 24 గంటల వ్యవథిలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. రాధేశ్యామ్ పై భారీ అంచనాలుండగా.. ఈటీపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.
ఇక ఓటీటీ విషయానికొస్తే.. ధనుష్ నటించిన మారన్ అనే సినిమా 11వ తేదీన డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇక ఆది పినిశెట్టి హీరోగా నటించిన క్లాప్ సినిమా సోనీ లివ్ లో అదే తేదీన స్ట్రీమింగ్ కు వస్తోంది. వీటితో పాటు పూనమ్ కౌర్ నటించిన నాతిచరామి అనే సినిమా ఏకంగా 20 ఓటీటీ వేదికలపై 10వ తేదీన ఒకేసారి స్ట్రీమ్ అవ్వబోతోంది.
వీటితో పాటు రవితేజ నటించిన ఖిలాడీ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో 11వ తేదీన, రౌడీబాయ్స్ సినిమా జీ5లో 11వ తేదీన, అనామిక సినిమా ఎస్ఎక్స్ ప్లేయర్ లో 10వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటితో పాటు ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు ఈ వారాంతం వస్తున్నాయి.