Telugu Global
Cinema & Entertainment

వంద కోట్లు సరే.. బ్రేక్ ఈవెన్ సంగతేంటి?

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాకు వంద కోట్ల రూపాయల షేర్ వచ్చింది. రెండో వీకెండ్ కే వంద కోట్ల రూపాయల షేర్ సాధించడం (దాదాపు 155 కోట్లు గ్రాస్) చాలా పెద్ద విషయం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవ్. అయితే అలాఅని సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టు కాదు. అవును.. పేరుకు వంద కోట్లు వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటివరకు బయ్యర్లకు లాభాలు అందించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు అమ్మారు […]

వంద కోట్లు సరే.. బ్రేక్ ఈవెన్ సంగతేంటి?
X

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాకు వంద కోట్ల రూపాయల షేర్ వచ్చింది. రెండో వీకెండ్ కే వంద కోట్ల రూపాయల షేర్ సాధించడం (దాదాపు 155 కోట్లు గ్రాస్) చాలా పెద్ద విషయం. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవ్. అయితే అలాఅని సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టు కాదు. అవును.. పేరుకు వంద కోట్లు వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటివరకు బయ్యర్లకు లాభాలు అందించలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు అమ్మారు భీమ్లానాయక్ సినిమాని. అంటే, సినిమాకు ఇంకా 10 కోట్ల రూపాయలకు పైగానే రావాలి. అప్పుడు మాత్రమే ఇది బ్రేక్ ఈవెన్ అయినట్టు లెక్క. మరోవైపు రాధేశ్యామ్ రిలీజ్ తరుముకొస్తున్న వేళ.. వర్కింగ్ డేస్ అయిన మంగళ, బుధ, గురువారాల్లో ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల వసూళ్లు అంటే దాదాపు అసాధ్యం.

ఇక ఏరియా వైజ్ చూసుకుంటే.. కేవలం ఓవర్సీస్ లో మాత్రమే భీమ్లానాయక్ హిట్ అయింది. అక్కడ లాభాలు వచ్చాయి. అత్యథికంగా కాస్ట్ ఫెయిల్యూర్ అయిన ఏరియా సీడెడ్. ఈ ప్రాంతంలో పవన్ సినిమాకు 5 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావాల్సి ఉంది. ఇక ఏపీలో ఉత్తరాంధ్రలో భీమ్లానాయక్ ఎగ్జిబిటర్లకు నష్టాలు తప్పేలా లేవు. వెస్ట్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ కు చేరువకాగా.. మిగతా అన్ని ప్రాంతాల్లో 90శాతం రికవరీ దగ్గరే సినిమా ఆగింది.

First Published:  8 March 2022 2:29 AM IST
Next Story