Telugu Global
NEWS

2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్..

ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ముమ్మాటికీ అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటామని పలుమార్లు స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని హైదరాబాద్ అని, 2024 వరకు అదే రాజధాని అని పేర్కొన్నారు. శాసనసభలో చట్టాలు చేయొద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారాయన. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాలన్నారు. […]

2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్..
X

ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ముమ్మాటికీ అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటామని పలుమార్లు స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. తాజాగా మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని హైదరాబాద్ అని, 2024 వరకు అదే రాజధాని అని పేర్కొన్నారు. శాసనసభలో చట్టాలు చేయొద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారాయన. రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పని చేయాలన్నారు. విభజన చట్టంలో 2024 వరకు ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారని, శివరామకృష్ణ కమిటీని వేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని, దాన్ని కూడా పార్లమెంట్ కి పంపించలేదని చెప్పారు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధానిగా ఉంటుందని అన్నారు.

హైదరాబాద్ నుంచే పరిపాలించండి..
మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. అక్కడికే వెళ్లిపోండి, అక్కడినుంచే పరిపాలించండి అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాష్ట్రం నుంచి పాలించాలనే తాము అమరావతికి వచ్చామని, ఇప్పుడు హైదరాబాదే రాజధాని అని వైసీపీ అంటే ఏం చేయగలం అని ప్రశ్నించారు. ఏపీలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు అచ్చెన్నాయుడు.

సభలో రభస..
ఏపీ అసెంబ్లీ తొలిరోజు సభలో రభస జరిగింది. లాంఛనంగా గవర్నర్ ప్రసంగంతో సభ ముగుస్తున్నా.. టీడీపీ సభ్యులు ఆ ప్రసంగ ప్రతుల్ని చించి విసిరేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడిని గవర్నర్‌ అడ్డుకోవడంలేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని, న్యాయవ్యవస్థపై దాడి జరిగినా గవర్నర్‌ స్పందించలేదని, గవర్నర్‌ పేరు మీద అప్పులు తీసుకున్నప్పుడూ పట్టించుకోలేదన్నారు టీడీపీ నేతలు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. గవర్నర్‌ కనీసం స్పందించలేదని, సమస్యలను గవర్నర్‌ పట్టించుకోనందువల్లే ప్రసంగం వినలేదని చెప్పారు.

ప్రజా స్వామ్యంపై గౌరవం లేదా..?
సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. గవర్నర్ కి కనీస మర్యాద ఇవ్వలేదని అన్నారు. టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఎమ్మెల్యేల చేత ఇలా చేయిస్తారా అని ప్రశ్నించారు. సభలో టీడీపీ అరాచకాన్ని ఖండిస్తున్నామన్నారు వైసీపీ నేతలు.

First Published:  7 March 2022 10:33 AM IST
Next Story