కేసీఆర్‌కు పీకే ఉంటే.. మాకు ఏకే 47 లాంటి వాళ్లున్నారు
కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు భయపడే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కేసీఆర్ తెచ్చుకున్నాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీలో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వాళ్లున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజల పక్షానపోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. 40 లక్షల సభ్యత్వాలను 50 లక్షల వరకు తీసుకెళ్తామన్నారు. పార్టీ సభ్యులకు రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో కష్టపడి […]
కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు భయపడే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను కేసీఆర్ తెచ్చుకున్నాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీలో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వాళ్లున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజల పక్షానపోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.
40 లక్షల సభ్యత్వాలను 50 లక్షల వరకు తీసుకెళ్తామన్నారు. పార్టీ సభ్యులకు రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించేందుకు సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటున్నామని, ఇందులో క్రియాశీలకంగా లేని వారికి ఎలాంటి పదవులు రాబోవని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుందని, ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన ఉన్నారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 30 వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.