జూనియర్ గా మారబోతున్న నితిన్?
ఎడిటర్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చేస్తున్నాడు నితిన్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారని […]
ఎడిటర్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చేస్తున్నాడు నితిన్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. ‘జూనియర్’ అనే టైటిల్ తో ఈ సినిమా రానుందని తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ గా మేకర్స్ చెప్పలేదు కానీ ఈ టైటిలే సినిమాకు ఫిక్స్ అని అంటున్నారు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన వక్కంతం వంశీ అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతడి డైరక్షనల్ కెరీర్ కు బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు మళ్లీ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కథా రచయిత. నితిన్ హీరోగా సినిమా ఓకే చేయించుకున్నాడు.
అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ‘ఏజెంట్’ సినిమాకు కథ-మాటలు అందిస్తున్నాడు వక్కంతం. త్వరలోనే నితిన్-వక్కంతం సినిమా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది.