Telugu Global
International

రెండో దఫా చర్చలు ముగిశాయి.. ఫలితం ఏంటంటే..?

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు జరిగిన రెండో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. యుద్ధం ఆగలేదు కానీ.. సాధారణ పౌరుల మరణాలకు సంబంధించి ఈ చర్చల్లో ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపుకోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్​ దేశాల ప్ర‌తినిధులు అంగీకరించారు. యుద్ధంలో పెద్ద సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. రెండో విడత […]

రెండో దఫా చర్చలు ముగిశాయి.. ఫలితం ఏంటంటే..?
X

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు జరిగిన రెండో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి. యుద్ధం ఆగలేదు కానీ.. సాధారణ పౌరుల మరణాలకు సంబంధించి ఈ చర్చల్లో ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపుకోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్​ దేశాల ప్ర‌తినిధులు అంగీకరించారు. యుద్ధంలో పెద్ద సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఇరు దేశాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. రెండో విడత చర్చలు బెలారస్ ​లో జ‌రిగాయి.

రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ చర్చలకు మార్గం సుగమం అయింది. అయితే ఉక్రెయిన్ కు కావాలసిన ఫలితాలు ఇంకా సాధించకుండానే చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం సలహాదారు మైఖేల్ పేర్కొన్నారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినా.. సామాన్య పౌరుల ప్రాణాలు బలికాకుండా ఇరు దేశాలు ప్రత్యేక కారిడార్ల ద్వారా పౌరుల తరలింపుకోసం ఒప్పందం చేసుకోవడం ఆశాజనక పరిణామం.

ఫేస్ టు ఫేస్ కి రెడీ..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని అన్నారాయన. రెండో దఫా చర్చలు జరుగుతుండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తమకు రక్షణ సాయం పెంచాలని పశ్చిమ దేశాలను జెలెన్‌ స్కీ అభ్యర్థించారు. రష్యా ఆక్రమణ ఉక్రెయిన్ తో ఆగదని, యూరప్ పై కూడా దాడులు జరిగే అవకాశముందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రష్యా జరిపే వైమానిక దాడులను ఆపేందుకు తమకు విమానాలు కావాలని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. తాము రష్యాపై దాడి చేయట్లేదని, అలాంటి ఆలోచన కూడా తమకి లేదన్నారు. రష్యా సేనలు వెంటనే తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలన్నారు జెలెన్‌ స్కీ.

First Published:  4 March 2022 9:21 AM IST
Next Story