Telugu Global
Cinema & Entertainment

ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారింది

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ […]

ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారింది
X

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ తో పాటు, గ్రాఫిక్ వర్క్ కూడా లేట్ అవ్వడంతో, వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు.

రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది.

ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుకున్నారు మేకర్స్. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఆదిపురుష్ కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రాముడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్.

First Published:  1 March 2022 2:58 PM IST
Next Story