Telugu Global
Cinema & Entertainment

పవన్ ను తొలిసారి అక్కడ కలిశాడంట

భీమ్లానాయక్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్ మీదున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ ను డైరక్ట్ చేయడంతో తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందంటున్న సాగర్ చంద్ర.. పవన్ కల్యాణ్ ను తొలిసారి కలిసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. భీమ్లానాయక్ రీమేక్ వెనక జరిగిన వివరాలతో పాటు.. సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు. – ఫస్ట్‌లాక్‌ డౌన్‌ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్‌ చేసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం గురించి మాట్లాడి, […]

పవన్ ను తొలిసారి అక్కడ కలిశాడంట
X

భీమ్లానాయక్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్ మీదున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ ను డైరక్ట్ చేయడంతో తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందంటున్న సాగర్ చంద్ర.. పవన్ కల్యాణ్ ను తొలిసారి కలిసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. భీమ్లానాయక్ రీమేక్ వెనక జరిగిన వివరాలతో పాటు.. సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు.

– ఫస్ట్‌లాక్‌ డౌన్‌ సమయంలో నిర్మాత వంశీ గారు ఫోన్‌ చేసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రం గురించి మాట్లాడి, ఆ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్నారు. కొద్దిరోజులకు మళ్లీ ఫోన్‌ చేసి ఈ సినిమా చేద్దామనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్‌ ఉందా అనడిగారు. నేను వెంటనే ఓకే అన్నా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ‘ఎలా చేద్దాం. తెలుగు ప్రేక్షకులకు కోసం ఎలాంటి మార్పులు చేద్దాం’ అన్న మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌, రానా గారు రావడంతో మరింత ఎగ్జైటింగ్‌గా ముందుకెళ్లాం.

– ప్రాజెక్ట్‌లో పవన్‌కల్యాణ్‌గారి పేరు వినిపించగానే అదొక గొప్ప అనుభూతి. ఆయన్ను డైరెక్ట్‌ చేయాలంటే ఇన్నేళ్ల కష్టం.. క్యాలిబర్‌, ప్లానింగ్‌, క్రియేటివిటీ… ఇంత ఉంటే ఇది జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా కుదరాలి.. ఆ పని జరగాలి అంతే. అవన్నీ ప్లాన్‌ చేసుకుంటే జరిగేవి కాదు.

– త్రివిక్రమ్‌గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి… అన్న దగ్గర మొదలైంది. అసలు ఇది రీమేక్‌ అని మరిచిపోయాం. మెయిన్‌ కథ, కమర్షియల్‌ అంశాలు, పవన్‌–రానా పాత్రల బ్యాలెన్స్‌ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్‌ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్‌ గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్‌ రీచ్‌ అయ్యాం అనుకుంటున్నా. రీమేక్‌లా కాకుండా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ లాంటి సినిమాను తెరకెక్కించాం అనుకుంటున్నాం.

– ఒరిజినల్‌ ఉన్న కొన్ని సన్నివేశాలను పవన్‌కల్యాణ్‌పై తీయలేదని చాలామంది అడుగుతున్నారు. అక్కడున్న అన్ని సన్నివేశాలు పెట్టాలంటే మన స్టోరీ టెల్లింగ్‌కు తేడా వస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో.. ఏ సీన్‌ పండుతుందో చెక్‌ చేసుకుని తీశాం.

– ‘వకీల్‌సాబ్‌’ సినిమా సెట్‌లో కల్యాణ్‌గారిని వన్‌ టు వన్‌ కలిశా. అప్పుడు కోర్టు రూమ్‌ సీన్‌ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా ‘బాగా తీయ్‌.. బాధ్యతగా పని చేయ్‌’ అని చెప్పారు. అంతేఎనర్జీతో మేం పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే!

First Published:  28 Feb 2022 3:15 PM IST
Next Story