Telugu Global
Cinema & Entertainment

మార్చి 2 నుంచి రాధేశ్యామ్ హంగామా

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే […]

మార్చి 2 నుంచి రాధేశ్యామ్ హంగామా
X

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.

దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే మార్చి 2 నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ తన చిత్ర యూనిట్ తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నాడు ప్రభాస్. ఇందులో భాగంగా 2వ తేదీన రిలీజ్ ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇకపై దశలవారీగా రాధేశ్యామ్ వివరాల్ని బయటపెట్టబోతున్నారు యూనిట్ జనాలు. మార్చి 11న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

First Published:  28 Feb 2022 3:20 PM IST
Next Story