Telugu Global
Cinema & Entertainment

భీమ్లానాయక్ 3 రోజుల వసూళ్లు

పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించింది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆదివారం కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఫలితంగా 3 రోజుల్లో 53 కోట్ల రూపాయల షేర్ సాధించింది ఈ మూవీ. అటు ఓవర్సీస్ లో […]

భీమ్లానాయక్ 3 రోజుల వసూళ్లు
X

పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ సాధించింది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆదివారం కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఫలితంగా 3 రోజుల్లో 53 కోట్ల రూపాయల షేర్ సాధించింది ఈ మూవీ.

అటు ఓవర్సీస్ లో కూడా భీమ్లా ర్యాంపేజ్ కొనసాగుతోంది. 3 రోజుల్లో 10 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాను 9 కోట్ల రూపాయలకు అమ్మారు. విడుదలైన 3 రోజుల్లోనే 10 కోట్లు సాధించి బ్రేక్ ఈవెన్ అందుకుంది ఈ మూవీ. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు వచ్చే ప్రతి పైసా లాభం కింద జమ అవుతుంది.

ఓవరాల్ గా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ భీమ్లానాయక్ సినిమాకు 69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మూవీని 106 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే.. మరో 37 కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అయినట్టే. క్లోజింగ్ సమయానికి ఈ సినిమాకు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీ, నైజాంలో భీమ్లానాయక్ కు 3 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 25.88 కోట్లు
సీడెడ్ – రూ. 7.02 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.66 కోట్లు
ఈస్ట్ – రూ. 3.60 కోట్లు
వెస్ట్ – రూ. 3.91 కోట్లు
గుంటూరు – రూ. 3.88 కోట్లు
కృష్ణా – రూ. 2.31 కోట్లు
నెల్లూరు – రూ. 1.81 కోట్లు

First Published:  28 Feb 2022 3:26 PM IST
Next Story