ఏప్రిల్ నుంచి జనగణమన
లైగర్ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు జనగణమన. ఇప్పుడా ప్రాజెక్టులో మరోసారి కదలిక వచ్చింది. మార్చి నెలాఖరుకు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు పూరి జగన్నాధ్. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలనేది వీళ్ల ప్లాన్. ఆగస్ట్ లో లైగర్ సినిమా విడుదల కానుంది. ఈ గ్యాప్ లోనే జనగణమన ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా […]
లైగర్ సినిమా థియేటర్లలోకి రాకముందే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు జనగణమన. ఇప్పుడా ప్రాజెక్టులో మరోసారి కదలిక వచ్చింది. మార్చి నెలాఖరుకు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయబోతున్నాడు పూరి జగన్నాధ్. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలనేది వీళ్ల ప్లాన్.
ఆగస్ట్ లో లైగర్ సినిమా విడుదల కానుంది. ఈ గ్యాప్ లోనే జనగణమన ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు పూరి జగన్నాధ్. ముందు షూటింగ్ పూర్తిచేసి తర్వాత విడుదల గురించి ఆలోచించొచ్చనేది యూనిట్ ఆలోచన. ఎందుకంటే, లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ బిజీ అవ్వబోతున్నాడు.
ఈ హీరో ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. శివ నిర్వాణ సినిమా కూడా లైన్లో ఉంది. అయితే పుష్ప-2 పనుల్లో సుకుమార్ బిజిగా ఉన్నాడు. అటు శివ నిర్వాణ సినిమా స్క్రీన్ ప్లే ఇంకా పూర్తికాలేదు. దీంతో ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండతో మరో సినిమా పూర్తిచేయాలనేది పూరి ప్లాన్.
పూరి జగన్నాధ్ తలుచుకుంటే సినిమాను రోజుల వ్యవథిలో పూర్తిచేస్తాడు. మహేష్ బాబు లాంటి హీరోను పెట్టి జస్ట్ అటుఇటుగా 45 రోజుల్లో బిజినెస్ మేన్ సినిమాను పూర్తిచేశాడు పూరి. అలాంటిది విజయ్ దేవరకొండను పెట్టి 3-4 నెలల్లో సినిమా పూర్తిచేయడం ఈ దర్శకుడికి పెద్ద పని కాదు.