Telugu Global
NEWS

తిరుమలలో వీఐపీ దర్శనాలకు 'బ్రేక్'..

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇకపై వారంలో నాలుగు రోజులు మాత్రమే వీఐపీ దర్శనాలుంటాయి. మిగతా మూడు రోజుల్లో సిఫారసు లేఖలపై వచ్చేవారికి బ్రేక్ దర్శనాలు ఉండవు. వారు స్వామివారి సేవలో పాల్గొనాలంటే ఆర్జిత సేవలు లేదా, సాధారణ దర్శనాల క్యూలైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వీఐపీల కోటా కింద 2గంటల పాటు దర్శన సమయాన్ని కేటాయిస్తుంది టీటీడీ. […]

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్..
X

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఇకపై వారంలో నాలుగు రోజులు మాత్రమే వీఐపీ దర్శనాలుంటాయి. మిగతా మూడు రోజుల్లో సిఫారసు లేఖలపై వచ్చేవారికి బ్రేక్ దర్శనాలు ఉండవు. వారు స్వామివారి సేవలో పాల్గొనాలంటే ఆర్జిత సేవలు లేదా, సాధారణ దర్శనాల క్యూలైన్లోనే వెళ్లాల్సి ఉంటుంది.

ప్రతి రోజూ వీఐపీల కోటా కింద 2గంటల పాటు దర్శన సమయాన్ని కేటాయిస్తుంది టీటీడీ. బ్రేక్ సమయాల్లో వీఐపీలు, వారి సిఫారసు లేఖలు తీసుకొచ్చేవారు స్వామివారిని దర్శించుకుంటారు. బ్రేక్ దర్శనాల సమయంలో సాధారణ క్యూలైన్లో వచ్చేవారిని నిలిపివేస్తుంటారు. ఇకపై అలాంటి బ్రేకులుండవు, వారంలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలకే బ్రేక్ వేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు గంటల సమయం కలసి వచ్చేలే సామాన్య భక్తులకు అధికంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. ప్రస్తతం రోజుకి 30వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండగా.. శుక్ర, శని, ఆది వారాల్లో వాటి కోటా పెంచుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు.

కాలినడక దర్శనాల విషయంలో సమాలోచనలు..
ప్రస్తుతం కాలినడక భక్తులకు ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వడంలేదు. గతంలో కాలినడకన వచ్చేవారికి మధ్యలో టోకెన్లు మంజూరు చేస్తుంటారు. కరోనా సమయంలో వారు కూడా సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలి, లేదా ప్రత్యేక దర్శనం టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దర్శనం టోకెన్ ఉన్నవారినే కాలినడక దారిలోకి అనుమతిస్తున్నారు. ఇకపై గతంలో లాగా.. కాలినడక భక్తులకు కూడా ఏరోజుకారోజు టికెట్లు కేటాయించే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కూడా త్వరలోనే టీటీడీ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

First Published:  25 Feb 2022 5:56 AM GMT
Next Story