Telugu Global
NEWS

శ్రీశైల మల్లన్నకు.. శ్రీవారి బంగారు తాపడం..

శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పింది. ఇప్పటికే ఎస్టిమేషన్లు కూడా సిద్ధమయ్యాయి. ఇక బంగారు తాపడం మొదలు పెట్టడమే తరువాయి. శ్రీశైలంలో గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ 2.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. ఇతర ఆలయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇటీవల కాణిపాకంలోని వరసిద్ధి […]

శ్రీశైల మల్లన్నకు.. శ్రీవారి బంగారు తాపడం..
X

శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పింది. ఇప్పటికే ఎస్టిమేషన్లు కూడా సిద్ధమయ్యాయి. ఇక బంగారు తాపడం మొదలు పెట్టడమే తరువాయి. శ్రీశైలంలో గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ 2.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు.. ఇతర ఆలయాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇటీవల కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడికి స్వర్ణ రథాన్ని తయారు చేయించి ఇచ్చింది. ఇప్పుడు శ్రీశైల మల్లన్నగోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తోంది.

4కేజీల బంగారం..
శ్రీశైలంలో మల్లన్న గోపురానికి రాగితో చేసిన దేవతల రూపాలు అమర్చి, వాటికి బంగారు మలాం వేయడానికి టీటీడీ సిద్ధమైంది. 24 క్యారెట్ల బంగారం 4కేజీలు అవసరం అవుతుందని అంచనా వేశారు. 160 కేజీల రాగి రేకులు కూడా కావాల్సి ఉంటుంది. మొత్తంగా శ్రీశైలంలో గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ 2.45 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసింది. బంగారం, రాగి, పనివారికయ్యే ఖర్చులు, ఇతరత్రా అన్నీ టీటీడీయే భరిస్తామని చెప్పింది. తాపడం పనులను మాత్రం శ్రీశైలం దేవస్థానం పర్యవేక్షిస్తుంది.

First Published:  24 Feb 2022 3:35 AM IST
Next Story