నాని బర్త్ డే హోమం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా, ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. నానికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీమ్ కాసేపటి క్రితం ఓ వీడియో రిలీజ్ చేసింది. దీనికి బర్త్ డే హోమం అనే పేరు పెట్టింది. ఈ వీడియో వాస్తవానికి సినిమాలోని నాని పాత్రను పరిచయం చేస్తుంది. అతను తన […]
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా, ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
నానికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీమ్ కాసేపటి క్రితం ఓ వీడియో రిలీజ్ చేసింది. దీనికి బర్త్ డే హోమం అనే పేరు పెట్టింది. ఈ వీడియో వాస్తవానికి సినిమాలోని నాని పాత్రను పరిచయం చేస్తుంది. అతను తన కుటుంబం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొనే అమాయక బ్రాహ్మణుడు. జాతకరీత్యా అతని జీవితంలో అనేక గండాలు ఉన్నందున, నానితో ఇంట్లో ఎప్పటికప్పుడు హోమాలు చేయిస్తుంటారు.
కామెడీ ఎంటర్ టైనర్లు తీయడంలో వివేక్ ఆత్రేయది డిఫరెంట్ స్టయిల్. ‘అంటే సుందరానికి’ సినిమా కూడా వివేక్ ఆత్రేయ మార్క్ తో తెరకెక్కుతోంది. నాని తన యాక్టింగ్ తో పూర్తిస్థాయిలో నవ్వులు పూయించబోతున్నాడు. హీరోయిన నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. అంటే సుందరానికి జూన్ 10వ తేదీ నుండి థియేటర్లలో నవ్వులు పంచబోతున్నాడు.