నేను మీకు బాగా కావాల్సినవాడ్ని అంటున్న హీరో
ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో స్వింగ్ లోకొచ్చాడు హీరో కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇతడి చేతిలో ఏకంగా అర డజను సినిమాలొచ్చి పడ్డాయి. వీటిలో గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సెబాస్టియన్, సమ్మతమే సినిమాల టీజర్లు రిలీజ్ చేసిన ఈహీరో, ఇప్పుడు ముచ్చటగా మరో సినిమా ప్రచారం మొదలుపెట్టాడు. కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా ఓ […]
ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో స్వింగ్ లోకొచ్చాడు హీరో కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇతడి చేతిలో ఏకంగా అర డజను సినిమాలొచ్చి పడ్డాయి. వీటిలో గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే సెబాస్టియన్, సమ్మతమే సినిమాల టీజర్లు రిలీజ్ చేసిన ఈహీరో, ఇప్పుడు ముచ్చటగా మరో సినిమా ప్రచారం మొదలుపెట్టాడు.
కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. తెలుగు సినిమా దర్శక లెజెండ్ కోడి రామకృష్ణ గారు సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే టైటిల్ ని ఖరారు చేశారు.
కోడి రామకృష్ణ చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియాటర్ కి పిక్నిక్ గా వెళ్ళి చూసేవారు. ఇప్పటికీ టీవి లో ఆయన చిత్రాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్షకులకి ఆయన బాగా కావాల్సినవాడిగా, వారి కుటుంబసభ్యుడిగా మారిపోయారు. అలాంటి తెలుగు దర్శకుడి పెద్ద కుమార్తె దివ్య దీప్తి, అలాగే మంచి చిత్రాలు చేస్తూ ప్రతి ప్రేక్షకుడికి బాగా కావాల్సిన వాడిలా కిరణ్ అబ్బవరం కలిసిపోవడం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోషన్స్ తో రావడం తో ఈ చిత్రానికి “నేను మీకు బాగా కావాల్సినవాడిని” అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.
కిరణ్ అబ్బవరం ఈ ఫస్ట్ లుక్ లో చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇకపై దశలవారీగా ప్రచార కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు మేకర్స్.