ఇంతకీ ఇందులో దొంగలు ఎవరు?
వెండితెరపై కొన్ని ఎవర్ గ్రీన్ ఫార్మాట్స్ ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపిస్తాయి ఈ ఫార్మాట్స్. అందులో ఒకటి దొంగ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో సినిమాలు నిరాశపరచవు. మినిమం గ్యారెంటీ హిట్ అందిస్తాయి. ఇప్పుడిదే ఫార్ములాతో వస్తోంది సింహా కోడూరి కొత్త సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబి చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వారి కాంబినేషన్‌లో […]
వెండితెరపై కొన్ని ఎవర్ గ్రీన్ ఫార్మాట్స్ ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపిస్తాయి ఈ ఫార్మాట్స్. అందులో ఒకటి దొంగ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తో సినిమాలు నిరాశపరచవు. మినిమం గ్యారెంటీ హిట్ అందిస్తాయి. ఇప్పుడిదే ఫార్ములాతో వస్తోంది సింహా కోడూరి కొత్త సినిమా.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి సంయుక్తంగా నిర్మించిన ఓ బేబి చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వారి కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండవ చిత్రం శాకిని ఢాకిని విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ సింహ కోడూరితో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ రోజు సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దొంగలున్నారు జాగ్రత్త అనేది టైటిల్. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. రోడ్డుపై కారుతో పాటు CC కెమెరా, కేబుల్‌తో కుర్చీకి కట్టేసిన శ్రీ సింహ కోడూరి అరుస్తూ కనిపించాడు. టైటిల్ లోగో ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమాలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.