లాలూకు ఐదేళ్లు జైలు.. రూ.60లక్షల జరిమానా..
పశు దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి మరోసారి జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. దాణా కుంభకోణం కేసుల్లో ఇది ఐదవది. డొరండా ఖజానా కేసుగా వ్యవహరించే ఈ కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పుని ప్రకటించింది. లాలూకి ఐదేళ్లు జైలు, రూ.60లక్షల జరిమానా విధించింది. లాలూతోపాటు మరో 99మంది నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం. 24మందిని నిర్దోషులుగా […]
BY sarvi21 Feb 2022 6:23 AM GMT
X
sarvi Updated On: 21 Feb 2022 6:23 AM GMT
పశు దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి మరోసారి జైలు శిక్ష విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. దాణా కుంభకోణం కేసుల్లో ఇది ఐదవది. డొరండా ఖజానా కేసుగా వ్యవహరించే ఈ కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జనవరి 29న తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పుని ప్రకటించింది. లాలూకి ఐదేళ్లు జైలు, రూ.60లక్షల జరిమానా విధించింది. లాలూతోపాటు మరో 99మంది నిందితులపై విచారణ జరిపిన న్యాయస్థానం. 24మందిని నిర్దోషులుగా పేర్కొంది.
ఐదు కేసులు.. పాతికేళ్లుగా విచారణ..
బీహార్ కు లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగింది. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. 1997 జూన్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు పాతికేళ్లపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. లాలూతోపాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్ర, మాజీ ఎంపీ జగదీశ్ శర్మ.. తదితరులపై సీబీఐ విచారణ ప్రారంభించింది. వీరిలో జగన్నాథ్ మిశ్ర 2019లో మరణించారు. దుమ్కా, దేవ్ ఘర్, ఛాయ్ బసా ఖజానాల నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు.
ఛాయ్ బసా ఖజానా నుంచి 37.7 కోట్ల రూపాయలు స్వాహా చేసిన కేసులో లాలూకి ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. అప్పుడే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఇక రెండో కేసులో మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష 5లక్షల జరిమానా లాలూకి విధించారు. మూడో కేసులో ఐదేళ్లు జైలు, 10లక్షల జరిమానా. నాలుగో కేసులో 14ఏళ్ల జైలు, 60 లక్షల రూపాయల జరిమానా లాలూకి విధించింది కోర్టు. ఐదో కేసులో ఐదేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు 60 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటివరకు లాలూ ప్రసాద్ మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకొచ్చిన ఆయన ఇటీవలే పాట్నాలో అడుగు పెట్టారు. తాజాగా మరోసారి ఆయనకు కోర్టు శిక్ష విధించడం గమనార్హం.
Next Story