Telugu Global
NEWS

బంగారు భారత్ కావాలి.. అమెరికా కంటే గొప్పగా ఉండాలి..

బంగారు తెలంగాణ సాధించాం, ఇక బంగారు భారత్ కోసం కష్టపడదాం అని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అమెరికా కంటే గొప్పగా భారత్ ని తయారు చేసుకుందామని అన్నారాయన. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, భారత దేశాన్ని బాగు చేసుకుందామని, దానికి ప్రజలందరి దీవెనలు కావాలన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని చెప్పారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని, ఇకపై విదేశీ విద్యార్థులే భారత్‌ కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు కేసీఆర్. ముంబై వెళ్లి […]

బంగారు భారత్ కావాలి.. అమెరికా కంటే గొప్పగా ఉండాలి..
X

బంగారు తెలంగాణ సాధించాం, ఇక బంగారు భారత్ కోసం కష్టపడదాం అని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అమెరికా కంటే గొప్పగా భారత్ ని తయారు చేసుకుందామని అన్నారాయన. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, భారత దేశాన్ని బాగు చేసుకుందామని, దానికి ప్రజలందరి దీవెనలు కావాలన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని చెప్పారు. ఇప్పటివరకు మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని, ఇకపై విదేశీ విద్యార్థులే భారత్‌ కు వచ్చే విధంగా అభివృద్ధి జరగాలన్నారు కేసీఆర్.

ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ని కలిసొచ్చిన మరుసటి రోజే మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బంగారు భారత్ అంటూ సరికొత్త పిలుపునిచ్చారు. ఇటీవల బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న కేసీఆర్, తమ హయాంలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి తెలంగాణనే ఉదాహరణగా చూపెడుతున్నారు. భారత్ ని అమెరికాకంటే గొప్పగా తయారు చేస్తామన్నారు.

నారాయణ్‌ ఖేడ్‌ లో పర్యటించిన కేసీఆర్, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. జహీరాబాద్‌, నారాయణ్‌ ఖేడ్‌ ప్రాంతాలకు నీరందాలని.. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చూపించాలనుకుంటున్న కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో బీజేపీని, కాంగ్రెస్ ని సమాన దూరంలో పెట్టిన ఆయన, ఈసారి కాంగ్రెస్ పై కాస్త ఉదారవాదంతో ఉన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేతలపై మండిపడ్డారు. థర్డ్ ఫ్రంట్ కి బలం లేకపోతే కాంగ్రెస్ ని కలుపుకొనిపోయే అవకాశాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  21 Feb 2022 9:10 AM GMT
Next Story