సెబాస్టియన్ వచ్చేస్తున్నాడు
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓపేరు తెచ్చుకున్నాడు. తన రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో కూడా మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. క్లాసు-మాసు, యూత్- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా మార్చి 4న ‘సెబాస్టియన్’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. జ్యోవిత సినిమాస్ పతాకంపై కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం […]
‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓపేరు తెచ్చుకున్నాడు. తన రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో కూడా మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. క్లాసు-మాసు, యూత్- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా మార్చి 4న ‘సెబాస్టియన్’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.
జ్యోవిత సినిమాస్ పతాకంపై కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఓ పాట హిట్టయింది. “హెలి”అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉంది. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, మహేష్ విట్టా, రవితేజ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.