Telugu Global
Cinema & Entertainment

విర్జిన్ స్టోరీ మూవీ రివ్యూ

నటీనటులు – విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి సంగీతం – అచు రాజమణి, సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ – గ్యారీ, సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్, నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్, రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి రేటింగ్ – 2/5 కొత్తదనం పేరిట రోజురోజుకు వింత పోకడలకు పోతోంది టాలీవుడ్. ఈ క్రమంలో టీనేజ్ అమ్మాయిలు-అబ్బాయిల ఫీలింగ్స్, సెక్స్ […]

విర్జిన్ స్టోరీ మూవీ రివ్యూ
X

నటీనటులు – విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి
సంగీతం – అచు రాజమణి,
సినిమాటోగ్రఫీ – అనీష్ తరుణ్ కుమార్,
ఎడిటర్ – గ్యారీ,
సాహిత్యం – భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్,
నిర్మాతలు – లగడపాటి శిరీష శ్రీధర్,
రచన, దర్శకత్వం – ప్రదీప్ బి అట్లూరి
రేటింగ్ – 2/5

కొత్తదనం పేరిట రోజురోజుకు వింత పోకడలకు పోతోంది టాలీవుడ్. ఈ క్రమంలో టీనేజ్ అమ్మాయిలు-అబ్బాయిల ఫీలింగ్స్, సెక్స్ కోసం వాళ్లు పడే తాపత్రయం నేపథ్యంలో తెరకెక్కింది విర్జిన్ స్టోరీ. ప్రయత్నం బాగుంది కానీ ఇక్కడ ప్రధానంగా 2 పొరపాట్లు జరిగాయి. యూత్ ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమాలో యూత్ కోసం ఎలాంటి బోల్డ్ సీన్లు పెట్టకపోవడం ఒక మైనస్ అయితే, సెకెండాఫ్ లో యూత్ యాంగిల్ ను మరిచిపోయి పెట్టిన బామ్మ ఎపిసోడ్ మరో పెద్ద మైనస్. దీంతో విర్జిన్ స్టోరీ ఎటూకాకుండా పోయింది. ఎవ్వర్నీ ఆకట్టుకోలేకపోయింది.

కంప్లీట్ అర్బన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఇది. విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)కు 19 ఏళ్లు. కాలేజ్ డ్రాపవుట్. వెబ్/యాప్ డిజైనింగ్ తో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటాడు. ప్రియాన్షు (సౌమికా పాండియన్) వయసు 18 ఏళ్లు. తల్లిదండ్రులకు ఒకే అమ్మాయి. ఫ్రెండ్స్ తో కలిసి హాస్టల్ లో ఉంటుంది. విక్రమ్ ను అంతా లూజర్ అంటుంటాడు, అమాయకంగా కనిపించడం వల్ల అమ్మాయిలు కూడా పడరు. ప్రేమించిన అమ్మాయి కూడా వాడుకొని వదిలేస్తుంది. ప్రియాన్షు మాత్రం ప్రేమలో పడుతుంది. కానీ ఆమె లవర్ ఆమెను అప్పటికే 3 సార్లు మోసం చేస్తాడు. దీంతో లవర్ ను మరిచిపోయేందుకు వన్ నైట్ స్టాండ్ కోసం ప్రయత్నిస్తుంది ప్రియాన్షు. ఎవరైనా అబ్బయి దొరుకుతాడేమోనని ఫ్రెండ్ తో కలిసి పబ్ కు వెళ్తుంది. అక్కడ విక్రమ్ ను చూస్తుంది. ఒక్కరాత్రి విక్రమ్ తో గడిపి, బాయ్ ఫ్రెండ్ పై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది.

ఇద్దరూ కలిసి ఓ రాత్రి గడిపేందుకు ఓ ప్లేస్ కోసం వెదుకుతారు. 2-3 చోట్ల ట్రై చేస్తారు. ప్రతి దగ్గర ఫెయిల్ అవుతుంటారు. చివరికి విక్రమ్, ప్రియాన్ష్ ను తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ కూడా ఇద్దరికీ ప్రైవసీ దొరకదు. దీంతో చుట్టూ తిరిగి ఓ చిన్న హోటల్ కు వెళ్తారు. అక్కడ పోలీసులుంటారు. ఇంతకీ ప్రియాన్షు కోరుకున్న సుఖాన్ని, విక్రమ్ అందించాడా లేదా? ఫైనల్ గా ఇద్దరూ కలిసి ఏం చేశారు అనేది ఈ స్టోరీ.

కథ చదివారుగా.. ఇలాంటి కథలో ఎవరైనా మంచి బోల్డ్ సీన్లు ఆశిస్తారు. మరీ ముఖ్యంగా కుర్రకారు కోరుకునేది కూడా ఇదే. కానీ బోల్డ్ కంటెంట్ తో తీసిన విర్జిన్ స్టోరీని పవిత్రంగా తెరకెక్కించి తప్పు చేశారు మేకర్స్. దీనికితోడు పేలవంగా రాసుకున్న స్క్రిప్ట్ ఈ సినిమాను విజయతీరానికి చేర్చలేకపోయింది. సెకెండాఫ్ అయితే మరీ దారుణం. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు దర్శకుడు. ఇలాంటి కథల్లో యూత్ ఎలిమెంట్స్ పుష్కలంగా పెట్టాలి. యూత్ కామెడీ (బూతు అయినా సరే)ని చొప్పించాలి. కానీ ఈ విర్జిన్ అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. దీనికితోడు సెకండాఫ్ లో బామ్మ ఎపిసోడ్ ను పెట్టి సినిమాను నీరుగార్చేశారు. ఉన్నంతలో ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటే అది ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రమే. నిర్మాత లగడపాటి తన కొడుకు కోసం ముందువెనక ఆలోచించకుండా ఈ సినిమాకు ఖర్చు చేశాడు.

నటీనటుల విషయానికొస్తే విక్రమ్ సహిదేవ్ బాగా చేశాడు. యూత్ ప్రతినిధిగా కనిపించాడు. ఈసారి డాన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. అయితే హీరోయిన్ సౌమికా ముందు మాత్రం విక్రమ్ తేలిపోయాడు. ఆమె తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఓవైపు అడపాదడపా స్కిన్ షో చేస్తూనే, మరోవైపు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. మిగతా సెటప్ అంతా ఇలా వచ్చి అలా వెళ్తుంది. చెప్పుకోడానికేం లేదు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగున్నప్పటికీ, అందరి ప్రయత్నం వృధా అయింది. అచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఒక పాట మినహా మిగతావేవీ బాగాలేవు. గ్యారీ ఎడిటింగ్, అనీష్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. దర్శకుడిగా ప్రదీప్ అట్లూరి ఫెయిల్ అయ్యాడు. కీలకమైన సెకెండాఫ్ లో అతడి రైటింగ్ టాలెంట్ కనిపించలేదు. మంచి సెటప్, అంతకంటే మంచి సపోర్ట్ ను దర్శకుడు వృధా చేసుకున్నాడు.

ఓవరాల్ గా విర్జిన్ స్టోరీ.. ఇటు యూత్ కు కనెక్ట్ అవ్వక, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించక త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయింది. విక్రమ్ సహిదేవ్ కు ఫ్లాప్ అందించింది.

First Published:  19 Feb 2022 1:36 PM IST
Next Story