Telugu Global
National

వారు కరెంటు, వీరు గ్యాస్ సిలిండర్లు.. పంజాబ్ లో ఉచితాల ప్రవాహం..

పంజాబ్ ఎన్నికల్లో ఉచితాల ప్రవాహం జోరుగా సాగుతోంది. ఆమధ్య ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేనిఫెస్టోలో ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పింది. దీనికి పోటీగా ఇప్పుడు కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్లను రంగంలోకి దించింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. మహిళలే టార్గెట్.. పంజాబ్ ఎన్నికల్లో రైతులే మెయిన్ టార్గెట్ అనుకున్నా.. అన్ని పార్టీలు మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కూడా తమ […]

వారు కరెంటు, వీరు గ్యాస్ సిలిండర్లు.. పంజాబ్ లో ఉచితాల ప్రవాహం..
X

పంజాబ్ ఎన్నికల్లో ఉచితాల ప్రవాహం జోరుగా సాగుతోంది. ఆమధ్య ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేనిఫెస్టోలో ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పింది. దీనికి పోటీగా ఇప్పుడు కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్లను రంగంలోకి దించింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్.

మహిళలే టార్గెట్..
పంజాబ్ ఎన్నికల్లో రైతులే మెయిన్ టార్గెట్ అనుకున్నా.. అన్ని పార్టీలు మహిళల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కూడా తమ మేనిఫెస్టోలో మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నించింది. లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశం కాగా.. జనాలను మాత్రం 8 ఉచిత సిలిండర్లు ఆకర్షిస్తున్నాయి. ఇక గృహిణులకు నెలకు 1100 రూపాయల చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకాల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, మాఫియాను అంతం చేస్తామని తెలిపారు కాంగ్రెస్ నేతలు.

ఆమ్ ఆద్మీ వరాలివి..
ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు హామీ కూడా ఇచ్చింది ఆమ్ ఆద్మీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటూ మహిళలను ఆకట్టుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.

బీజేపీ టార్గెట్ ఏంటి..?
ఇటీవల బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో నిర్మాణాత్మక కార్యక్రమాల వివరణ ఉంది కానీ, జనాకర్షక పథకాలు లేవు. పంజాబ్ లో డ్రగ్స్ ఎవరికీ అందకుండా చేస్తామంటూ హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక అమరీందర్ సింగ్ తో కలసి పంజాబ్ లో కాంగ్రెస్ ని అణగదొక్కాలని చూస్తోంది బీజేపీ. కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ, పాలన మార్చేస్తామంటున్నారు కానీ, ఉచితాల జోలికి వెళ్లలేదు. మరి పంజాబ్ ప్రజలు సిలిండర్లు కావాలనుకుంటారో లేక, కరెంట్ ఫ్రీగా పొందాలనుకుంటారో.. ఇంకేదైనా సంచలనానికి శ్రీకారం చుడతారో.. చూడాలి.

First Published:  19 Feb 2022 3:34 AM IST
Next Story