Telugu Global
Cinema & Entertainment

ముస్లింలకు క్షమాపణలు చెప్పిన హీరో

విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా ఎఫ్ఐఆర్. రీసెంట్ గా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాపై కొంతమంది ముస్లిం వర్గీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వివాదంపై హీరో విష్ణు విశాల్ స్పందించాడు. ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్పాడు. “ఈ సినిమా పోస్ట‌ర్ ను చూసి కొంత‌మంది ముస్లిం సోద‌రులు కాంట్ర‌వ‌ర్సీ గా భావించారు. వారికి క్ష‌మాప‌ణ చెబుతున్నాం. సినిమాను చూస్తే మీకే అర్త‌మ‌వుతుంది. ముస్లిం సోద‌రులు అర్థం చేసుకోగ‌ల‌ని భావిస్తున్నాం. ఇలా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం […]

ముస్లింలకు క్షమాపణలు చెప్పిన హీరో
X

విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా ఎఫ్ఐఆర్. రీసెంట్ గా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాపై కొంతమంది ముస్లిం వర్గీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ వివాదంపై హీరో విష్ణు విశాల్ స్పందించాడు. ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్పాడు.

“ఈ సినిమా పోస్ట‌ర్ ను చూసి కొంత‌మంది ముస్లిం సోద‌రులు కాంట్ర‌వ‌ర్సీ గా భావించారు. వారికి క్ష‌మాప‌ణ చెబుతున్నాం. సినిమాను చూస్తే మీకే అర్త‌మ‌వుతుంది. ముస్లిం సోద‌రులు అర్థం చేసుకోగ‌ల‌ని భావిస్తున్నాం.

ఇలా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశాడు విష్ణు విశాల్. ఎఫ్ఐఆర్ సినిమా తెలుగులో బాగా ఆడుతోందన్న విష్ణు విశాల్.. రవితేజకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. అతడితో త్వరలోనే ఓ సినిమా నిర్మిస్తామంటున్నాడు.

“క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత థియేట‌ర్ ఓన‌ర్లు, పంపిణీదారులు మా సినిమా ప‌ట్ల ఆనందంగా వున్నార‌ని చెప్ప‌డం మా రెండున్న‌ర ఏళ్ళ కృషి ఫ‌లించింద‌నిపించింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్ర‌త్యేకంగా ఓ విష‌యం ప్ర‌క‌టిస్తున్నాం. ర‌వితేజ బేన‌ర్ ఆర్‌టి.టీమ్ వ‌ర్క్స్‌తో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెలుగు, త‌మిళ సినిమాను నిర్మించ‌బోతోంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం. ఈ సినిమాలో ఎక్కువ‌మంది తెలుగు నటీన‌టులే వుంటార‌ని తెలిపారు.”

విష్ణు విశాల్ హీరోగా న‌టించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలయింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా తెలుగులో రిలీజ్ చేశారు

First Published:  17 Feb 2022 12:54 AM IST
Next Story