Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సరసన పెళ్లిసందడి భామ?

కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాకే క్రేజ్ తెచ్చుకొని భారీ ఆఫర్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తూ తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్స్ లిస్టు లో చేరిపోతారు. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా అందులో చేరబోతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా సాంగ్స్ లో తన గ్లామర్ తో కుర్రకారుని బాగా […]

ప్రభాస్ సరసన పెళ్లిసందడి భామ?
X

కొందరు హీరోయిన్స్ మొదటి సినిమాకే క్రేజ్ తెచ్చుకొని భారీ ఆఫర్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తూ తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్స్ లిస్టు లో చేరిపోతారు. ఈ లిస్టులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు శ్రీలీల కూడా అందులో చేరబోతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో ఎక్కడలేని క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా సాంగ్స్ లో తన గ్లామర్ తో కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేసింది. అందుకే టాలీవుడ్ లో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం రవితేజతో ‘ధమాకా’ అనే సినిమా చేస్తోంది శ్రీలీల. వాలంటైన్స్ డే సందర్భంగా రవితేజ, శ్రీలీల కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండో సినిమా సెట్స్ పై ఉండగానే ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇక తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఈ అమ్మడి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తుంది.

ప్రభాస్ హీరోగా మారుతి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. వీళ్లలో ఒక హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారట. అదే కనుక నిజమైతే, ఈ అమ్మడు జాక్ పాట్ కొట్టినట్టే.

First Published:  15 Feb 2022 4:41 PM IST
Next Story