Telugu Global
Cinema & Entertainment

విజిల్ మహాలక్ష్మికి అనూహ్య స్పందన

ఉప్పెన సక్సెస్ తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది కృతి షెట్టి. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే అంగీకరిస్తోంది. ఇందులో భాగంగా బంగార్రాజు సినిమాలో మంచి పాత్ర పోషించింది. సుధీర్ బాబు సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయం బయటకొచ్చింది. ఇప్పుడు రామ్-లింగుసామి సినిమాలో కృతి షెట్టి పాత్ర డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఆమె పాత్రకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’లో క‌ర్నూల్‌కు చెందిన ఆర్జే (రేడియో […]

విజిల్ మహాలక్ష్మికి అనూహ్య స్పందన
X

ఉప్పెన సక్సెస్ తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది కృతి షెట్టి. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే అంగీకరిస్తోంది. ఇందులో భాగంగా బంగార్రాజు సినిమాలో మంచి పాత్ర పోషించింది. సుధీర్ బాబు సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయం బయటకొచ్చింది. ఇప్పుడు రామ్-లింగుసామి సినిమాలో కృతి షెట్టి పాత్ర డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఆమె పాత్రకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

రామ్ హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’లో క‌ర్నూల్‌కు చెందిన ఆర్జే (రేడియో జాకీ)గా కృతీ శెట్టి సందడి చేయనుంది. ఆమె క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. క‌ర్నూల్‌లో విజిల్ మహాలక్ష్మి అంటే చాలా ఫేమస్. అమ్మాయి చేసే ప్రోగ్రామ్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పోలీస్‌కి, ఆర్జేకు ఎక్కడ కుదిరింది? ప్రేమలో ఎలా పడ్డారు? అనేది సినిమాలో చూడాలి.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజైన ఆయన లుక్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కూల్‌గా స్కూటర్ నడుపుతూ విడుదల చేసిన కృతి శెట్టి లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. విజిల్ మహాలక్ష్మి లుక్ తో వారియర్ పై అఁచనాలు ఇంకాస్త పెరిగాయి.

First Published:  15 Feb 2022 4:29 PM IST
Next Story