సవాంగ్ బదిలీ.. ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా ఫుల్ అడిషనల్ చార్జెస్ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌కమిషనర్ గా గతంలో ఆయన పనిచేశారు. డ్రగ్ కంట్రోల్ విభాగ అధికారిగా కూడా ఆయన […]
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా ఫుల్ అడిషనల్ చార్జెస్ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్‌కమిషనర్ గా గతంలో ఆయన పనిచేశారు. డ్రగ్ కంట్రోల్ విభాగ అధికారిగా కూడా ఆయన పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగానూ పనిచేశారు.
సవాంగ్ ను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. 2023 జులై వరకు సవాంగ్ కు పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే ఆయన్ను బదిలీ చేసింది ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను బదిలీ చేసి 2019లో గౌతమ్ సవాంగ్ ని డీజీపీగా నియమించింది. అప్పటికి ఆయన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్నారు. తాజాగా ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కొత్త డీజీపీగా పోస్టింగ్ ఇచ్చింది.