ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత..
ఏపీలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు మాత్రం కొనసాగతాయని స్పష్టం చేసింది. ప్రజలంతా మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, వాణిజ్య కార్యకలాపాలు జరిగే సమయంలో, షాపుల్లో, మాల్స్ లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. ఫీవర్ సర్వే కొనసాగింపు.. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. కొవిడ్ పరీక్షల సంఖ్య కూడా తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో […]
ఏపీలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు మాత్రం కొనసాగతాయని స్పష్టం చేసింది. ప్రజలంతా మాస్క్‌లు కచ్చితంగా పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, వాణిజ్య కార్యకలాపాలు జరిగే సమయంలో, షాపుల్లో, మాల్స్ లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది.
ఫీవర్ సర్వే కొనసాగింపు..
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. కొవిడ్ పరీక్షల సంఖ్య కూడా తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో మాత్రం పరీక్షల సంఖ్య కొనసాగించాలని, కొవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ టెస్ట్ లు చేయాల్సిందేనని చెప్పారు సీఎం జగన్. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగించాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, వైద్యం అందించే బాధ్యతలను వేరు చేయాలని, వేర్వేరుగా నిర్వహణ ఉండాలని సీఎం ఆదేశించారు. పరిపాలనా బాధ్యతలను నిపుణులైన వారికి అప్పగించాలని సూచించారు.
500కంటే తగ్గిన రోజువారీ కేసులు..
ఏపీలో రోజువారీ కేసుల్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసులు 500కంటే తక్కువకు చేరుకున్నాయి. పరీక్షల సంఖ్య మాత్రం తగ్గించలేదు. రోజుకి సగటన 15వేలమందికి ఏపీలో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలో కొత్తగా వచ్చే 16 వైద్య కళాశాలల్లో ట్రామా కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు జగన్. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.