Telugu Global
National

వ్యాక్సిన్లు మురిగిపోతున్నాయి.. ప్రభుత్వం దయ చూపాలి..

భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగానే సాగుతున్నా.. ప్రైవేటు రంగంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో టీకాల అమ్మకాలు ముందుకు సాగలేదు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తూ, మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అనుమతులిచ్చింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదట్లో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్ సమయానికి చాలామందికి వ్యాక్సిన్లపై గురి కుదిరింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం వ్యాక్సిన్లకు […]

వ్యాక్సిన్లు మురిగిపోతున్నాయి.. ప్రభుత్వం దయ చూపాలి..
X

భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగానే సాగుతున్నా.. ప్రైవేటు రంగంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో టీకాల అమ్మకాలు ముందుకు సాగలేదు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తూ, మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అనుమతులిచ్చింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదట్లో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సెకండ్ వేవ్ సమయానికి చాలామందికి వ్యాక్సిన్లపై గురి కుదిరింది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం వ్యాక్సిన్లకు డిమాండ్ లేకపోవడంతో స్టాక్ అలా మురిగిపోతోంది. దీంతో ఎక్స్ పయిరీ డేట్ దగ్గరపడిపోతోందని, వ్యాక్సిన్లను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రులు మొర పెట్టుకుంటున్నాయి.

అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (AHPI) ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల వద్ద లక్షల్లో మిగిలిపోయిన కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలనుf తిరిగి ప్రభుత్వం సేకరించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. మార్చి నాటికి ఈ టీకాలు ఎక్స్ పయిర్ అయిపోతాయని ఆలోగా వాటిని వినియోగించాలని, దీనికి ప్రభుత్వం సేకరించడం మినహా ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. గడువు తేదీలోగా ప్రైవేటు సెక్టార్ లో టీకాలను వినియోగించడం కుదరదని అంటున్నాయి ఆస్పత్రుల యూనియన్లు.

గతేడాది డిసెంబర్లోనే ఈ తరహా ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు. అప్పట్లో సానుకూలంగా స్పందించినా.. ఇప్పటి వరుకు ఆ టీకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు, మరోవైపు మార్చి నెలాఖరుకు ఎక్స్ పయిరీ డేట్ ఉన్న టీకాలు తరగలేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. మరోసారి కేంద్ర ఆరోగ్య శాఖ వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లాయి. తమిళనాడులోని అపోలో ఆస్పత్రిలో మార్చిలో ఎక్స్ పయిరీకీ సిద్ధంగా ఉన్న 6 లక్షల కొవాక్సిన్ టీకాలు ఉన్నాయి. వీటిని సేకరించాలంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యంకు AHPI విజ్ఞప్తి చేసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ ఆస్పత్రులు టీకాల స్టాక్ తో సతమతం అవుతున్నాయి.

First Published:  13 Feb 2022 8:30 AM IST
Next Story