క్లాస్ రూమ్ లో నమాజ్ కుదరదు.. కర్నాటక స్కూల్ ఆదేశాలు..
కర్నాటకలోని కడాబా తాలూకా, అంకతడ్కలోని ఓ స్కూల్ లో పిల్లలు క్లాస్ రూమ్ లో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే హిజాబ్ వివాదంతో కర్నాటకలో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో స్కూళ్లు తెరిచిన తర్వాత క్లాస్ రూమ్ లో నమాజు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆ స్కూల్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది ఇకపై క్లాస్ రూమ్ లో […]
కర్నాటకలోని కడాబా తాలూకా, అంకతడ్కలోని ఓ స్కూల్ లో పిల్లలు క్లాస్ రూమ్ లో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే హిజాబ్ వివాదంతో కర్నాటకలో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో స్కూళ్లు తెరిచిన తర్వాత క్లాస్ రూమ్ లో నమాజు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆ స్కూల్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది ఇకపై క్లాస్ రూమ్ లో నమాజు చేయడానికి ఎవర్నీ అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. అదే సమయంలో స్కూల్ టైమింగ్స్ లో పిల్లలను మతపరమైన ప్రార్థనలకోసం బయటకు పంపేందుకు అనుమతి లేదని చెప్పింది.
కర్నాటకలోని స్కూల్ లో ఐదు, ఆరు, ఏడు తరగతులు చదివే పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఒక క్లాస్ రూమ్ లో కూర్చుని నమాజ్ చేయడాన్ని కొందరు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్కూల్ కమిటీ మీటింగ్ పెట్టింది. ఆ పిల్లల తల్లిదండ్రుల్ని కూడా పిలిపించింది. ఇకపై క్లాస్ రూమ్ లో నమాజ్ కుదరదని తేల్చి చెప్పింది. దానికి పేరెంట్స్ అంగీకారం కూడా తీసుకుంది.
గతంలో ఈ స్కూల్ లో చదువుకునే ఏడుగురు పిల్లలు ప్రతి శుక్రవారం దగ్గర్లోని మసీదు కు నమాజ్ కోసం వెళ్లేవారు. సరిగ్గా స్కూల్ లంచ్ టైమ్ లో నమాజ్ జరుగుతుంది. తల్లిదండ్రులు ఆ సమయానికి వచ్చి పిల్లల్ని కూడా తమతోపాటు నమాజ్ కి తీసుకెళ్లేవారు. అయితే గత శుక్రవారం తల్లిదండ్రులు రావడం ఆలస్యం కావడంతో పిల్లలు క్లాస్ రూమ్ లోనే నమాజ్ కి సిద్ధమయ్యారు. వారు నమాజ్ చేస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. అసలే హిజాబ్ గొడవ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై వెంటనే స్కూల్ కమిటీ స్పందించింది. ఇకపై క్లాస్ రూమ్ లో నమాజు చేయడం కుదరదని తేల్చి చెప్పింది.