Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ సినిమాలో జగపతి బాబు

ల‌క్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్ – ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న విష‌యం తెలిసిందే.. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ […]

గోపీచంద్ సినిమాలో జగపతి బాబు
X

ల‌క్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్ – ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న విష‌యం తెలిసిందే.. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో విల‌క్ష‌ణ‌ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టించనున్నారు. జ‌గ‌ప‌తిబాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.

ల‌క్ష్యం త‌ర్వాత గోపిచంద్‌, శ్రీ‌వాస్‌, జ‌గ‌ప‌తిబాబు ల స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రానికి వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండ‌గా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథ, వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలకు తగ్గట్టుగా శ్రీవాస్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతోన్నారు.

First Published:  13 Feb 2022 12:13 PM IST
Next Story