Telugu Global
NEWS

ఏపీలో కొత్త జిల్లాలకు పాత కలెక్టర్లు, ఎస్పీలు..

ఏపీలోని జిల్లాల విభజన ప్రక్రియకోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఉగాదినాటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, కొత్త జిల్లాల నుంచి పాలన మొదలు కావాలని సీఎం జగన్ తాజాగా అధికారులను ఆదేశించారు. కొత్తజిల్లాల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలపై వస్తున్న అభ్యంతరాల్లో హేతుబద్ధత ఉంటే, అభ్యంతరం తెలిపినవారిని పిలిపించి మాట్లాడారని, వారి అభ్యంతరాలు పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని.. ఈ కార్యక్రమం సజావుగా సాగాలని, ముందు దీనికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని […]

ఏపీలో కొత్త జిల్లాలకు పాత కలెక్టర్లు, ఎస్పీలు..
X

ఏపీలోని జిల్లాల విభజన ప్రక్రియకోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఉగాదినాటికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, కొత్త జిల్లాల నుంచి పాలన మొదలు కావాలని సీఎం జగన్ తాజాగా అధికారులను ఆదేశించారు. కొత్తజిల్లాల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలపై వస్తున్న అభ్యంతరాల్లో హేతుబద్ధత ఉంటే, అభ్యంతరం తెలిపినవారిని పిలిపించి మాట్లాడారని, వారి అభ్యంతరాలు పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని.. ఈ కార్యక్రమం సజావుగా సాగాలని, ముందు దీనికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

పాతవాళ్లంతా కొత్త జిల్లాలకు..
ఏపీలో ప్రస్తుతం ఉన్న జిల్లాలు 13. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు ఏర్పడాల్సి ఉండగా.. అరకు పార్లమెంట్ ని రెండు జిల్లాలుగా విభజించడంతో ఆ సంఖ్య 26కి చేరింది. అంటే 13 పాత జిల్లాలు మరో 13 కొత్త జిల్లాలు ఏర్పడతాయనమాట. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకోసం పనిచేస్తున్న కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వాటికోసం బదిలీ చేస్తామని ముందే సూచించారు సీఎం జగన్. ఇప్పుడున్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపుతామన్నారు. వారి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని, పరిపాలన సాఫీగా సాగేందుకు తోడ్పడుతుందని, అక్కడ మౌలిక సౌకర్యాల కల్పనను వారే పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు సీఎం. కొత్తగా ఏర్పడే జిల్లాలకు పాత కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయితే.. ఇక పాత జిల్లాలకు పదోన్నతి ద్వారా వచ్చే వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించాల్సి ఉంటుంది.

కొత్త భవనాలు..
కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో.. పాలనా పరమైన సౌలభ్యం కోసం కొత్త భవనాలు నిర్మించడానికి యంత్రాంగం ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు సీఎం జగన్. దీనికి అవసరమైన స్థలాలను గుర్తించి ప్రణాళికను ఖరారు చేయాలని కోరారు. జిల్లా పరిషత్ ల విభజనపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. జిల్లాలవారీగా ఉద్యోగుల విభజన, మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టాలన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తికావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

First Published:  11 Feb 2022 2:54 AM IST
Next Story