Telugu Global
Cinema & Entertainment

జగన్ ను కలిసే సినీ ప్రముఖులు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ఈరోజు ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి టైమ్ ఇచ్చారనేది వాస్తవం. మరోసారి చిరంజీవి వెళ్లి జగన్ ను కలవబోతున్నారనేది కూడా నిజం. అయితే ఈ భేటీకి చిరంజీవితో పాటు ఇంకా ఎవరెవరు వెళ్తున్నారనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి సంబంధించి టాలీవుడ్ లో చాలా చర్చ నడుస్తోంది. చిరంజీవి ఈసారి తానొక్కరే వెళ్లడం లేదు. తనతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖుల్ని తీసుకెళ్తున్నారు. డీవీవీ దానయ్య, అల్లు అరవింద్ […]

జగన్ ను కలిసే సినీ ప్రముఖులు ఎవరు?
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖుల భేటీ ఈరోజు ఫిక్స్ అయింది. ముఖ్యమంత్రి టైమ్ ఇచ్చారనేది వాస్తవం. మరోసారి చిరంజీవి వెళ్లి జగన్ ను కలవబోతున్నారనేది కూడా నిజం. అయితే ఈ భేటీకి చిరంజీవితో పాటు ఇంకా ఎవరెవరు వెళ్తున్నారనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి సంబంధించి టాలీవుడ్ లో చాలా చర్చ నడుస్తోంది.

చిరంజీవి ఈసారి తానొక్కరే వెళ్లడం లేదు. తనతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖుల్ని తీసుకెళ్తున్నారు. డీవీవీ దానయ్య, అల్లు అరవింద్ లాంటి వాళ్లు ఈసారి ఉండే ఛాన్స్ ఉంది. అయితే వీళ్లతో పాటు ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు కూడా వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజం అనేది మరికాసేపట్లో తేలిపోతుంది.

మరోవైపు ఈ మీటింగ్ కోసం చిరంజీవి, బాలకృష్ణతో కూడా మాట్లాడినట్టు కథనాలొచ్చాయి. జగన్ ను కలిసేందుకు బాలయ్యను చిరంజీవి ఆహ్వానించారని, ఆ ఆఫర్ ను బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా హిందూపూర్ లో దీక్ష చేసినందువల్ల, ముందుజాగ్రత్త చర్యగా ఐసొలేషన్ లో ఉన్నారట బాలయ్య.

ఇలా జగన్ తో భేటీకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఫిలింఛాంబర్, నిర్మాతల మండలి సభ్యుల్ని కలవకుండా చిరంజీవితో భేటీ కావడాన్ని తమ్మారెడ్డి భరధ్వాజ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ తో ఎవరు భేటీ అవుతారో చూడాలి.

First Published:  10 Feb 2022 2:46 AM IST
Next Story