Telugu Global
Cinema & Entertainment

మంచి కథ దొరికితే మహేష్ తో మల్టీస్టారర్

మహేష్ తో సినిమా చేస్తాడో చేయడో తెలీదు కానీ, ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్స్ మాత్రం ఇస్తుంటాడు సుధీర్ బాబు. ఆ స్టేట్ మెంట్స్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని పదే పదే చెబుతుంటాడు. ఈసారి కూడా అదే ప్రకటనను రిపీట్ చేశాడు. “గత పదేళ్లలో నేనెప్పుడూ మహేష్‌ని ఏ ఫేవర్ కోసం సంప్రదించ లేదు. అది నేను పాటిస్తున్న సూత్రం. దర్శకనిర్మాతలు నా ప్రతిభను గౌరవిస్తున్నారు. […]

మంచి కథ దొరికితే మహేష్ తో మల్టీస్టారర్
X

మహేష్ తో సినిమా చేస్తాడో చేయడో తెలీదు కానీ, ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్స్ మాత్రం ఇస్తుంటాడు సుధీర్ బాబు. ఆ స్టేట్ మెంట్స్ లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని పదే పదే చెబుతుంటాడు. ఈసారి కూడా అదే ప్రకటనను రిపీట్ చేశాడు.

“గత పదేళ్లలో నేనెప్పుడూ మహేష్‌ని ఏ ఫేవర్ కోసం సంప్రదించ లేదు. అది నేను పాటిస్తున్న సూత్రం. దర్శకనిర్మాతలు నా ప్రతిభను గౌరవిస్తున్నారు. అదే కారణంతో నాకు ఆఫర్లు వస్తున్నాయి. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది నా కోరిక.”

నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడు సుధీర్ బాబు. ఈ సందర్భంగా మహేష్ తో సినిమాపై స్పందించాడు. ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ నటుడు.. ఇవాళ్టికి సినిమాల్లోకి వ‌చ్చి ప‌దేళ్ళు అవుతోంది. ఇతడు నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్‌. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమ్-కామ్‌లో నటిస్తున్నాడు.

First Published:  10 Feb 2022 3:33 AM IST
Next Story