Telugu Global
National

సైలెంట్ గా మొదలైన సమరం.. యూపీలో నేడే తొలిదశ పోలింగ్..

కరోనా ఆంక్షల నేపథ్యంలో ర్యాలీలు, ప్రచార ఆర్భాటాలు లేకుండానే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు మొదలయ్యాయి. నేడు ఉత్తర ప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున పోటీలో ఉన్నారు. ప్రస్తుత సీఎం యోగి కేబినెట్‌ లోని 8 మంది మంత్రులు […]

సైలెంట్ గా మొదలైన సమరం.. యూపీలో నేడే తొలిదశ పోలింగ్..
X

కరోనా ఆంక్షల నేపథ్యంలో ర్యాలీలు, ప్రచార ఆర్భాటాలు లేకుండానే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు మొదలయ్యాయి. నేడు ఉత్తర ప్రదేశ్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున పోటీలో ఉన్నారు. ప్రస్తుత సీఎం యోగి కేబినెట్‌ లోని 8 మంది మంత్రులు తొలిదశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎన్నికలు జరిగే 11 జిల్లాల్లో జాట్ ల ప్రాబల్యం ఎక్కువ. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని జాట్ లే ముందుండి నడిపించారు. చివరకు విజయం సాధించారు. ఈ దశలో మరి జాట్ వర్గం బీజేపీకి మద్దతు ఇస్తుందా లేక, ఇతర పార్టీలవైపు చూస్తుందా అనేది తేలాల్సి ఉంది.

ఈరోజు ఎన్నికలు జరుగుతున్న 58 అసెంబ్లీ స్థానాల్లో… 53 చోట్ల గతంలో బీజేపీ గెలిచింది. ఎస్పీ, బీఎస్పీ చెరో రెండు స్థానాలు, ఆర్‌ఎల్డీ ఒక స్థానంలో విజయం సాధించాయి. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాలనుంచి పైకి ఎగబాకుతుందో లేదో తేలాల్సి ఉంది. ఇక కాంగ్రెస్, వ్యవసాయ రుణాల మాఫీ, 20లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, వరి, గోధుమలకు అత్యధిక మద్దతు ధర.. అంటూ ఆకర్షణీయమైన మేనిఫెస్టో విడుదల చేసినా.. యూపీలో ఆ పార్టీకి ప్రజలు మద్దతు అంతంతమాత్రమేనని ప్రీపోల్స్ చెబుతున్నాయి.

యూపీలో నేటితో మొదలయ్యే పోలింగ్ 7 దశల్లో పూర్తవుతుంది. మార్చి 7న తుది దశ పోలింగ్ జరుగుతుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలకు సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు పూర్తవుతాయి. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడాల్సి ఉంది.

First Published:  10 Feb 2022 4:27 AM IST
Next Story