8 లక్షల ఖాళీలు ఉన్నా.. ఎందుకు ఉద్యోగాలివ్వడం లేదు..?
కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో భర్తీ చేయని ఖాళీలు లక్షల సంఖ్యకు చేరుకుంటున్నాయి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భర్తీకాని ఉద్యోగ ఖాళీల గురించి రాజ్యసభలో ఆయన ప్రస్తావించారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల ఉద్యోగ ఖాళీలు నేటికీ భర్తీ కాలేదని, ఇందులో సైన్యంలోని త్రివిధ దళాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు, రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు విజయసాయిరెడ్డి […]
కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో భర్తీ చేయని ఖాళీలు లక్షల సంఖ్యకు చేరుకుంటున్నాయి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భర్తీకాని ఉద్యోగ ఖాళీల గురించి రాజ్యసభలో ఆయన ప్రస్తావించారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల ఉద్యోగ ఖాళీలు నేటికీ భర్తీ కాలేదని, ఇందులో సైన్యంలోని త్రివిధ దళాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు, రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.
ఉద్యోగ ఖాళీల ప్రకటన, పరీక్షల నిర్వహణ, రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాల ప్రకటన, నియామక ప్రక్రియ పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రశ్నా పత్రాలు లీకవ్వడం, రిక్రూట్‌మెంట్ బోర్డుల్లో జరుగుతున్న అవకతవకలపైన కోర్టుల్లో ఏళ్ళతరబడి కొనసాగుతున్న దావాలు వంటి కారణాలతో ఏడాదిలో పూర్తి కావలసిన నియామక ప్రక్రియ 2-3 సంవత్సరాలు గడిచినా పూర్తి కావడం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి పగలు, రాత్రి కష్టపడి చదివే యువతను కేంద్ర ప్రభుత్వ విధానాలు తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు విజయసాయిరెడ్డి. నిర్ణీత కాల వ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వలన లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వంలోని వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని రాజ్యసభలో ప్రస్తావించారు.