Telugu Global
Cinema & Entertainment

శశివదనే షూటింగ్ అప్ డేట్స్

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “ఇప్పటివరకూ 30 శాతం […]

శశివదనే షూటింగ్ అప్ డేట్స్
X

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు – నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, ‘రంగస్థలం’ మహేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ “ఇప్పటివరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో రెండు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలు తీశాం. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచె, శ్రీమాన్, ‘రంగస్థలం’ మహేష్ జాయిన్ అవుతారు. గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’. లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. యూనిక్‌గా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు సినిమాను చాలా గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు చూశాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మ్యూజిక్, విజువల్స్ హైలైట్ అవుతాయి” అని అన్నారు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలక్ట్ చేసుకుంటున్నాడు రక్షిత్. అతడు నటించిన పలాస ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శశివదనే సినిమాలో కూడా అలాంటి కొత్తదనం ఉంది కాబట్టే ఓకే చెప్పానంటున్నాడు రక్షిత్.

First Published:  8 Feb 2022 4:22 PM IST
Next Story