లిప్ కిస్ కూడా ఓ హ్యూమన్ ఎమోషన్
ఓ కమర్షియల్ సినిమాలో నటించేటప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని, లిప్ కిస్ కూడా అందులో భాగమే అంటోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఖిలాడీ సినిమాలో రవితేజతో కలిసి లిప్ లాక్ లో నటించిన ఈ చిన్నది.. పాత్ర స్వభావ రీత్యా లిప్ కిస్ పెట్టడంలో తప్పు లేదంటోంది. యాక్టింగ్ నేర్చుకున్నప్పుడే అలాంటి వాటన్నింటికీ ట్రయిన్ అయి వస్తామని చెబుతోంది. “కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేను బెరుకుగా వుంటే కంఫర్ట్ అయ్యేవరకు టైం తీసుకోమని రవితేజ సూచించేవారు. […]
ఓ కమర్షియల్ సినిమాలో నటించేటప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని, లిప్ కిస్ కూడా అందులో భాగమే అంటోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఖిలాడీ సినిమాలో రవితేజతో కలిసి లిప్ లాక్ లో నటించిన ఈ చిన్నది.. పాత్ర స్వభావ రీత్యా లిప్ కిస్ పెట్టడంలో తప్పు లేదంటోంది. యాక్టింగ్ నేర్చుకున్నప్పుడే అలాంటి వాటన్నింటికీ ట్రయిన్ అయి వస్తామని చెబుతోంది.
“కొన్ని సీన్స్ చేసేటప్పుడు నేను బెరుకుగా వుంటే కంఫర్ట్ అయ్యేవరకు టైం తీసుకోమని రవితేజ సూచించేవారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ట్రైలర్‌లో లిప్‌లాక్ ఉంది. కమర్షియల్ సినిమా కాబట్టి కొన్ని అంశాలుంటాయి. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఇలా వుంటుంది కేరెక్టర్ తీరు అని చెబుతారు. దానికి మనం ఓకే చెప్పిన తర్వాతే లిప్ సీన్లు పెడతారు. కమర్షియల్ సినిమాలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. అవి హ్యూమన్ ఎమోషన్సే. అంతకుమించి లైన్ క్రాస్ చేయం. ఇది కూడా నటనలో ఓ భాగమే.”
ఇలా లిప్ కిస్సులపై చాలా బోల్డ్ గా స్పందించింది మీనాక్షి. కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు లిప్ కిస్సులకు దూరం అనే నిబంధన పెట్టడం సరైన పద్ధతి కాదంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడివి శేష్ తో కలిసి హిట్-2 సినిమాలో నటిస్తోంది.