Telugu Global
National

భారత్ లో లక్ష కంటే దిగువకు రోజువారీ కొవిడ్ కేసులు..

భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపుకి చేరుకుంది. గడచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 83,876. రోజువారీ కేసులు లక్షలోపుకి దిగిరావడం జనవరి 6 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. రికవరీ రేటు 96.19శాతానికి పెరగడం, పాజిటివిటీ రేటు 7.25 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 11,56,363 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. […]

భారత్ లో లక్ష కంటే దిగువకు రోజువారీ కొవిడ్ కేసులు..
X

భారత్ లో థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపుకి చేరుకుంది. గడచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 83,876. రోజువారీ కేసులు లక్షలోపుకి దిగిరావడం జనవరి 6 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. రికవరీ రేటు 96.19శాతానికి పెరగడం, పాజిటివిటీ రేటు 7.25 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 11,56,363 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 83,876 మందికి పాజిటివ్‌ గా తేలింది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 11లక్షలుగా ఉంది. కొద్ది రోజులుగా కేరళ సహా కొన్ని రాష్ట్రాలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తూ మరణాల సంఖ్యను సవరిస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,02,874 మంది కరోనా కారణంగా మరణించారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 169.63 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఆంక్షల కొనసాగింపు..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై మాత్రం ఆంక్షలను కొనసాగిస్తోంది ఎన్నికల కమిషన్. రోడ్‌ షోలు, పాదయాత్రలపై నిషేధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 11వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. అయితే కేసులు తగ్గుతున్న దృష్ట్యా.. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాల నిర్వహణకు మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చారు. అధికారుల అనుమతితో బహిరంగ సభలకు 1000 మందికి అనుమతి ఇచ్చారు. ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకు బృందంగా వెళ్లొచ్చనే వెసులుబాటు ఇచ్చారు. సమావేశ మందిరాల్లో జరిగే కార్యక్రమాలకు గతంలో 300 మందికి మించకూడదనే పరిమితి విధించిన ఈసీ, ఈసారి ఆ సంఖ్యను 500వరకు పెంచింది.

ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. ఆ వ్యాప్తిని మళ్లీ పెంచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర పేర్కొన్నారు. నేతలంతా కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కూడా కొవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

First Published:  7 Feb 2022 11:30 AM IST
Next Story