రవితేజ ఖిలాడీ ట్రయిలర్ రివ్యూ
ఈ నెల థియేటర్లలోకి రాబోతున్న మొట్టమొదటి బిగ్ మూవీ ఖిలాడీ. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రిలీజైంది ఖిలాడీ ట్రయిలర్. ఈరోజు రిలీజైన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం. ఓ పెద్ద కంటైనర్ తో డబ్బును తరలిస్తున్న విజువల్స్ తో ఖిలాడీ ట్రయిలర్ రిలీజైంది. ఆ డబ్బును హీరో రవితేజ కొట్టేసినట్టు చూపించారు. ఆ డబ్బును […]

ఈ నెల థియేటర్లలోకి రాబోతున్న మొట్టమొదటి బిగ్ మూవీ ఖిలాడీ. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రిలీజైంది ఖిలాడీ ట్రయిలర్. ఈరోజు రిలీజైన ఈ సినిమా ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.
ఓ పెద్ద కంటైనర్ తో డబ్బును తరలిస్తున్న విజువల్స్ తో ఖిలాడీ ట్రయిలర్ రిలీజైంది. ఆ డబ్బును హీరో రవితేజ కొట్టేసినట్టు చూపించారు. ఆ డబ్బును రవితేజ ఎక్కడ దాచాడో తెలియక విలన్లు తికమక పడుతుంటారు. అంతలోనే రవితేజ లోని డిఫరెంట్ షేడ్స్ ను చకచకా ట్రయిలర్ లో పరిచయం చేశారు. ఇలా ఆకట్టుకునే విధంగా సాగింది ట్రయిలర్.
ట్రయిలర్ లో రవితేజ మేనరిజమ్స్, యాక్షన్ ఎలిమెంట్స్, హీరోయిన్స అందాలు, దేవిశ్రీ పాటలు.. ఇలా అన్నింటినీ పరిచయం చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉన్నాయి. సీనియర్ నటుడు అర్జున్ కూడా ఇందులో కనిపించాడు. కాకపోతే అతడి పాత్ర నెగెటివ్ గా ఉంటుందా, పాజిటివ్ గా సాగుతుందా అనే విషయంపై ట్రయిలర్ లో క్లారిటీ ఇవ్వలేదు.
ఈనెల 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది ఖిలాడీ. రమేష్ వర్మ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.