Telugu Global
National

కాంగ్రెస్ తో బీజేపీ పద్మభూషణ్ రాజకీయం..

ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్స్‌ లిస్ట్ లో మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ పేరు ఉంది. ఆ తర్వాత రోజే ఆయనకు కేంద్రం పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు ప్రకటించిన తర్వాత విడుదల చేసిన పంజాబ్ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్స్‌ లిస్ట్ లో మాత్రం ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా గులాంనబీ ఆజాద్ […]

కాంగ్రెస్ తో బీజేపీ పద్మభూషణ్ రాజకీయం..
X

ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్‌ క్యాంపెయినర్స్‌ లిస్ట్ లో మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ పేరు ఉంది. ఆ తర్వాత రోజే ఆయనకు కేంద్రం పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు ప్రకటించిన తర్వాత విడుదల చేసిన పంజాబ్ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్స్‌ లిస్ట్ లో మాత్రం ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా గులాంనబీ ఆజాద్ ని పొగడ్తల్లో ముంచెత్తి కాంగ్రెస్ కి మంటపుట్టేలా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల ఆయనకు పద్మ భూషణ్ ప్రకటించడం మరింత ఆశ్చర్యకరంగా ఉంది.

మనీష్ తివారీపై కూడా అసంతృప్తి..
మరో సీనియర్ నేత మనీష్ తివారీపై కూడా కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్‌ నుంచి ఆయన ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో మనీష్ తివారీ పేరు లేకపోవడం గమనార్హం.

జీ-23ని దూరం పెట్టారా..?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంస్కరణల కోసం గతంలో 23మంది నేతలు అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ 23మందిని గ్రూప్ -23 పేరుతో పార్టీకి కాస్త దూరం పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ జీ-23 కూటమిని దూరం పెడుతున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై మనీష్ తివారీ కూడా తీవ్రంగా స్పందించారు. తనని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చి ఉంటే తాను ఆశ్చర్యపోయేవాడినని, చేర్చకపోతే అది పెద్ద విశేషమేమీ కాదని అన్నారు. పరోక్షంగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీపోల్స్ అంచనాలతో ఇప్పటికే దిగాలు పడ్డ కాంగ్రెస్.. పంతం కొద్దీ సీనియర్ నేతలను దూరం చేసుకుంటూ మరింత కష్టాల్లో కూరుకుపోతోంది.

First Published:  5 Feb 2022 8:29 AM IST
Next Story