Telugu Global
Cinema & Entertainment

విడాకుల కథ అవ్వడం వల్ల బాగా నచ్చిందంట

కొందరికి కొన్ని కాన్సెప్టులు ఎందుకు నచ్చుతాయో చెప్పలేం. సుమంత్ కు కూడా అలానే ఓ కాన్సెప్ట్ నచ్చింది. అదే మళ్లీ మొదలైంది సినిమా. విడాకుల కాన్సెప్ట్ పై తీసిన సినిమా ఇది. తను విడాకులకు వ్యతిరేకమని, కానీ ఈ కాన్సెప్ట్ తనకు చాలా బాగా నచ్చిందని అంటున్నాడు సుమంత్. “కథ చెప్పేటప్పుడు విడాకులు గురించి చెప్పడంతో ఈ కథ నాకు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము. విడాకులంటే నాకు ఇష్టమని కాదు, విడాకుల్ని బేస్ చేసుకొని […]

విడాకుల కథ అవ్వడం వల్ల బాగా నచ్చిందంట
X

కొందరికి కొన్ని కాన్సెప్టులు ఎందుకు నచ్చుతాయో చెప్పలేం. సుమంత్ కు కూడా అలానే ఓ కాన్సెప్ట్ నచ్చింది. అదే మళ్లీ మొదలైంది సినిమా. విడాకుల కాన్సెప్ట్ పై తీసిన సినిమా ఇది. తను విడాకులకు వ్యతిరేకమని, కానీ ఈ కాన్సెప్ట్ తనకు చాలా బాగా నచ్చిందని అంటున్నాడు సుమంత్.

“కథ చెప్పేటప్పుడు విడాకులు గురించి చెప్పడంతో ఈ కథ నాకు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము. విడాకులంటే నాకు ఇష్టమని కాదు, విడాకుల్ని బేస్ చేసుకొని చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చింది. అనూప్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రేమకథ దగ్గర్నుంచి నా ప్రతి సినిమాకు ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా ఆలోన్. ఆలోన్ అనే పాట కూడా సిగ్నేచర్ సాంగ్ అవుతుంది.”

సీరియస్ సబ్జెక్ట్ ను సరదాగా చెప్పాలని అనుకున్నామని, మళ్లీ మొదలైంది సినిమాతో మా ప్రయత్నం సక్సెస్ అయిందని అంటున్నాడు సుమంత్. విడాకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని చెబుతున్నాడు. ఈనెల 11న జీ5లో డైరక్ట్ గా రిలీజ్ అవ్వబోతోంది మళ్లీ మొదలైంది సినిమా.

First Published:  5 Feb 2022 1:36 PM IST
Next Story