Telugu Global
Cinema & Entertainment

పాటలతో సందడి చేయబోతున్న ఎఫ్3

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మొదటి పాట […]

f3 movie
X

సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి 'ఎఫ్ 3' సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మొదటి పాట అయిన 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు' అనే ఈ పాట ఫిబ్రవరి 7న రాబోతోంది. ఇక ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే.

సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తయింది. ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్గా రాబోతోన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్ అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది.

First Published:  4 Feb 2022 11:39 AM IST
Next Story