చలో విజయవాడకు అనుమతి లేదు.. ఉద్యోగులకు సెలవలు లేవు..
చలో విజయవాడకి అనుమతి లేకపోయినా ఉద్యోగులు పోలీసుల కళ్లుగప్పి బెజవాడ చేరుకుంటున్నారు. చాలా చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టినా వారు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు విజయవాడలో చేసేది నిరసన ప్రదర్శన కాదని, బల ప్రదర్శన అని, అలాంటివాటిని ప్రభుత్వం సహించదని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు చలో విజయవాడకోసం ఉద్యోగులు పెట్టిన సెలవల్ని కూడా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు. సెలవలు ఇవ్వొద్దు.. చలో విజయవాడకోసం వెళ్తున్న ఉద్యోగులంతా బుధవారం నాడే తమ కార్యాలయాల్లో […]
చలో విజయవాడకి అనుమతి లేకపోయినా ఉద్యోగులు పోలీసుల కళ్లుగప్పి బెజవాడ చేరుకుంటున్నారు. చాలా చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టినా వారు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు విజయవాడలో చేసేది నిరసన ప్రదర్శన కాదని, బల ప్రదర్శన అని, అలాంటివాటిని ప్రభుత్వం సహించదని చెప్పారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు చలో విజయవాడకోసం ఉద్యోగులు పెట్టిన సెలవల్ని కూడా ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నారు.
సెలవలు ఇవ్వొద్దు..
చలో విజయవాడకోసం వెళ్తున్న ఉద్యోగులంతా బుధవారం నాడే తమ కార్యాలయాల్లో వ్యక్తిగత పనులతో సెలవు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాటిని ఉన్నతాధికారులు తిరస్కరించారు. అత్యవసరమైతే తెప్ప ఎవరికీ సెలవలు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో హడావిడిగా గురువారం రోజు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేశారు. ఓటీఎస్, జగనన్న కాలనీల పురోగతి.. ఇతర కార్యక్రమాల పేరుతో జాయింట్ కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ వీడియో కాన్ఫరెన్స్ లకు హాజరు కావడం లేదనే విషయంపై ఆరా తీస్తున్నారు.
హౌస్ అరెస్ట్ లు..
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల్ని నిన్నటినుంచీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇల్లు దాటి బయటకు రానీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం కూడా ప్రధాన బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో ఉద్యోగ సంఘాల నేతల్ని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చలో విజయవాడను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10మందితో అయినా బెజవాడలో ప్రదర్శన చేపడతామంటున్నారు.