Telugu Global
Cinema & Entertainment

భీమ్లానాయక్ బాటలో రామారావు

ప్రతి సినిమాకు 2 రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తో ఈ ట్రెండ్ మొదలైంది. దీన్ని భీమ్లానాయక్, గని సినిమాలు అనుసరించాయి. ఇప్పుడీ బాటలో రవితేజ సినిమా కూడా నడిచింది. మాస్ రాజా హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా 2 రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ […]

భీమ్లానాయక్ బాటలో రామారావు
X

ప్రతి సినిమాకు 2 రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తో ఈ ట్రెండ్ మొదలైంది. దీన్ని భీమ్లానాయక్, గని సినిమాలు అనుసరించాయి. ఇప్పుడీ బాటలో రవితేజ సినిమా కూడా నడిచింది. మాస్ రాజా హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కూడా 2 రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు మేకర్లు ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. రెండు డేట్లను మేకర్లు లాక్ చేశారు. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

‘మా చిత్రంపై మాకు ప్రేమ అలానే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాను మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’ అని నిర్మాతలు ప్రకటించారు.

దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

First Published:  1 Feb 2022 4:30 PM IST
Next Story