Telugu Global
Cinema & Entertainment

అనూహ్యంగా తెరపైకొచ్చిన రెహ్మాన్

ఊహించని విధంగా ఏఆర్ రెహ్మాన్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల కోసం రెహ్మాన్ పేరు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ రెండు సినిమాలేంటి? నిజంగా రెహ్మాన్ ఆ సినిమాలకు వర్క్ చేస్తున్నాడా? చూద్దాం.. రెహ్మాన్ పేరు ముందుగా తెరపైకొచ్చిన సినిమా పూరి జగన్నాధ్ ది. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ చేస్తున్న ఈ దర్శకుడు, అదే హీరోతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చాన్నాళ్లుగా తన మైండ్ […]

అనూహ్యంగా తెరపైకొచ్చిన రెహ్మాన్
X

ఊహించని విధంగా ఏఆర్ రెహ్మాన్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల కోసం రెహ్మాన్ పేరు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ రెండు సినిమాలేంటి? నిజంగా రెహ్మాన్ ఆ సినిమాలకు వర్క్ చేస్తున్నాడా? చూద్దాం..

రెహ్మాన్ పేరు ముందుగా తెరపైకొచ్చిన సినిమా పూరి జగన్నాధ్ ది. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ చేస్తున్న ఈ దర్శకుడు, అదే హీరోతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చాన్నాళ్లుగా తన మైండ్ లో నలుగుతున్న జనగణమన ప్రాజెక్టును దేవరకొండ హీరోగా సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ఏఆర్ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా అనుకుంటున్నారట.

ఇక రెహ్మాన్ పేరు తెరపైకొచ్చిన మరో సినిమా ఎన్టీఆర్ ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. కొరటాల సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు మూవీనే మొదలవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసం రెహ్మాన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకుంటున్నారట.

ఇలా ఊహించని విధంగా ఒకేసారి 2 సినిమాలతో రెహ్మాన్ పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి రెహ్మాన్ వీటిలో ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? అసలు టాలీవుడ్ ప్రాజెక్టుకు అతడు మ్యూజిక్ ఇస్తాడా అనేది త్వరలోనే తెలుస్తోంది.

First Published:  1 Feb 2022 4:34 PM IST
Next Story