Telugu Global
Cinema & Entertainment

అల్లరి నరేష్ కొత్త సినిమా సంగతులు

లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా లాంఛ్ చేశాడు అల్లరినరేష్. కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ కామెడీ స్టార్.. ఇప్పుడు అదే జానర్ లో సినిమా స్టార్ట్ చేశాడు. అల్లరి న‌రేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. జీ స్టుడియోస్, అల్లరినరేష్ సంయుక్తంగా ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి. […]

అల్లరి నరేష్ కొత్త సినిమా సంగతులు
X

లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా లాంఛ్ చేశాడు అల్లరినరేష్. కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన ఈ కామెడీ స్టార్.. ఇప్పుడు అదే జానర్ లో సినిమా స్టార్ట్ చేశాడు. అల్లరి న‌రేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

జీ స్టుడియోస్, అల్లరినరేష్ సంయుక్తంగా ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాకు 50శాతం బడ్జెట్ ను జీ స్టూడియోస్ భరిస్తోంది. రీసెంట్ గా వచ్చిన బంగార్రాజు సినిమాకు కూడా జీ స్టుడియోస్ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్నాడట అల్లరి నరేష్.

వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర తో కలిసి ఈ సినిమాలో కామెడీ చేయబోతున్నాడు అల్లరి నరేష్. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ు అందిస్తున్నాడు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్లడించబోతున్నారు. 3 నెలల్లో సినిమాను రెడీ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

First Published:  1 Feb 2022 4:28 PM IST
Next Story