మహేష్ స్థానం ఆక్రమించిన విజయ్ దేవరకొండ
అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తన సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ రూపంలో, సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ఆ క్రేజే, విజయ్ దేవరకొండకు ఇప్పుడో మంచి అవకాశం తెచ్చిపెట్టింది. ఇకపై థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు రౌడీ స్టార్. […]
అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో యూత్ లో ఎనలేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తన సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ రూపంలో, సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ఆ క్రేజే, విజయ్ దేవరకొండకు ఇప్పుడో మంచి అవకాశం తెచ్చిపెట్టింది.
ఇకపై థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు రౌడీ స్టార్. ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు తీసుకున్నాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ తర్వాత టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. మార్కెట్ పరంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనం.
థమ్స్ అప్ కు విజయ్ బ్రాండింగ్ చేస్తున్నాడనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూఫాన్, రౌడీ ఫర్ థండర్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ఈ యాడ్ మంగళవారం నుండి అఫీషియల్ గా సోషల్ మీడియా, టీవీల్లో ప్రసారం అవుతుంది.
ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. విజయ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది