Telugu Global
Cinema & Entertainment

మరో రిలీజ్ డేట్ ప్రకటించిన విశాల్

విశాల్ హీరోగా నటించిన సినిమా సామాన్యుడు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈసారి రిలీజ్ పక్కా అంటున్నాడు విశాల్. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటాడు విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. శరవణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. విశాల్ […]

మరో రిలీజ్ డేట్ ప్రకటించిన విశాల్
X

విశాల్ హీరోగా నటించిన సినిమా సామాన్యుడు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా మరో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈసారి రిలీజ్ పక్కా అంటున్నాడు విశాల్.

సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటాడు విశాల్. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమా ‘సామాన్యుడు’ ఓ యూనిక్ కంటెంట్ తో తెరకెక్కింది. శరవణన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది.

ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ చూస్తే.. ఫుల్ యాక్షన్ మోడ్ లో ‘సామాన్యుడు’ సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అలాగే సెకండ్ సాంగ్ ‘మత్తెక్కించే’ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా, టెక్నికల్ గా చాలా రిచ్ గా ఉంటుందంటున్నాడు విశాల్.

వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విశాల్, తను కోరుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. అటు తమిళనాట అతడి సినిమాలు ఓ మోస్తరుగా ఆడుతున్నప్పటికీ, తెలుగులో మాత్రం విశాల్ తన మార్కెట్ కోల్పోయాడు. ఇలాంటి టైమ్ లో వస్తున్న సామాన్యుడు సినిమా, విశాల్ ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందిస్తుందా అనేది చూడాలి.

First Published:  30 Jan 2022 2:28 PM IST
Next Story