Telugu Global
Cinema & Entertainment

సలార్ సినిమాపై అవన్నీ పుకార్లే

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాపై 24 గంటలుగా ఒకటే పుకార్లు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందనేది ఆ పుకారు సారాంశం. స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ గాసిప్ ను ట్రెండ్ చేయడంతో చాలామంది నిజం అనుకున్నారు. ఎట్టకేలకు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. సలార్ సినిమా రెండు భాగాలుగా రావడం లేదు. సింగిల్ మూవీగానే థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ పుకారు రావడానికి ఓ బలమైన కారణం ఉంది. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ […]

సలార్ సినిమాపై అవన్నీ పుకార్లే
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాపై 24 గంటలుగా ఒకటే పుకార్లు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందనేది ఆ పుకారు సారాంశం. స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ గాసిప్ ను ట్రెండ్ చేయడంతో చాలామంది నిజం అనుకున్నారు. ఎట్టకేలకు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. సలార్ సినిమా రెండు భాగాలుగా రావడం లేదు. సింగిల్ మూవీగానే థియేటర్లలోకి వస్తోంది.

నిజానికి ఈ పుకారు రావడానికి ఓ బలమైన కారణం ఉంది. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకుముందు కేజీఎఫ్ తీశాడు. అది రెండు భాగాలుగా వచ్చింది. ఇక సలార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి, సలార్ సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందంటూ ఊహాగానాలు వ్యాపించాయి. అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి.

ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ మోడ్ లో ఉంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది సలార్.

First Published:  30 Jan 2022 2:36 PM IST
Next Story