Telugu Global
Cinema & Entertainment

కొలిక్కి వచ్చిన నిఖిల్ సినిమా

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ’18 పేజెస్’. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్లీ మొదలైంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోంది. మరో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. కుమారి 21-ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 18-పేజెస్. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా […]

కొలిక్కి వచ్చిన నిఖిల్ సినిమా
X

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ’18 పేజెస్’. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మళ్లీ మొదలైంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ నడుస్తోంది. మరో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

కుమారి 21-ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 18-పేజెస్. ఇందులో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ పాటికే షూటింగ్ పూర్తై ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేయాల్సింది. కానీ, కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించాడు.

ఇక నిఖిల్ దీనితో పాటు ‘కార్తికేయ -2’లోనూ నటిస్తున్నాడు. ఇందులో కూడా హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు స్పై అనే మరో యాక్షన్ మూవీ కూడా చేస్తున్నాడు. అటు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమా కూడా స్టార్ట్ చేశాడు.

First Published:  29 Jan 2022 1:07 PM IST
Next Story