క్వారంటైన్ లో చిరు.. అటు తల్లి పుట్టినరోజు
తన తల్లి పుట్టినరోజు అంటే చిరంజీవికి పండగ రోజు. తల్లి పుట్టినరోజు నాడు స్వయంగా చిరంజీవి, ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. తన చేతితో స్వయంగా టిఫిన్ చేసి తల్లికి తినిపిస్తారు. ఆరోజు ఎక్కువ సమయం తల్లితో గడపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం చిరంజీవికి ఆ అవకాశం లేకుండా పోయింది. తన తల్లి పుట్టినరోజు నాడు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టేశారు చిరు. దీనికి ఓ కారణం ఉంది. […]
తన తల్లి పుట్టినరోజు అంటే చిరంజీవికి పండగ రోజు. తల్లి పుట్టినరోజు నాడు స్వయంగా చిరంజీవి, ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు. తన చేతితో స్వయంగా టిఫిన్ చేసి తల్లికి తినిపిస్తారు. ఆరోజు ఎక్కువ సమయం తల్లితో గడపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం చిరంజీవికి ఆ అవకాశం లేకుండా పోయింది. తన తల్లి పుట్టినరోజు నాడు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టేశారు చిరు. దీనికి ఓ కారణం ఉంది.
తాజాగా కరోనా బారిన పడ్డారు చిరంజీవి. దీంతో ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఇదే టైమ్ లో చిరు తల్లి పుట్టినరోజు వచ్చింది. దీంతో ప్రత్యక్షంగా తల్లికి శుభాకాంక్షలు చెప్పలేకపోయారు చిరంజీవి. ఆమెకు తన చేతితో వండి తినిపించలేకపోయారు. తన బాధను వ్యక్తం చేస్తూనే, ట్విట్టర్ లో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ పాత జ్ఞాపకాన్ని ఫొటో రూపంలో పంచుకున్నారు.
చిరంజీవి అవస్థను గమనించిన ఆయన ఫ్యాన్స్, తల్లి అంజనాదేవి పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. చిరంజీవి తరఫున ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ.. తమ హీరోకు ఆనందం కలిగించారు. ఫ్యాన్స్ చేసిన ఈ పనికి చిరంజీవి పులకించిపోయారు.